అనకాపల్లి: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో అత్యాధునిక క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం!
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రూ. 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఇకపై అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో ఆసుపత్రి సామర్థ్యాన్ని 400 పడకలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.