విశాఖపట్నం: సింహాచలం ఆలయంలో వైభవంగా జరిగిన నిత్య కళ్యాణం
సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో నేడు నిత్య కళ్యాణ వేడుక జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.