మణుగూరు: జిల్లాలో భారీగా రోడ్డు ప్రమాదాలు: 410 ప్రమాదాల్లో 191 మంది మృతి - డీఆర్వో హెచ్చరిక
జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలపై డీఆర్వో పద్మావతి సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి అక్టోబర్ 15 వరకు 410 ప్రమాదాల్లో 191 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారులపైనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతా చర్యలు వేగవంతం చేయాలని డీఆర్వో ఆదేశించారు.