వరంగల్: వరంగల్ ఎల్బీ కళాశాలలో విద్యార్థుల కోసం మాక్ గ్రామసభ నిర్వహణ
వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో విద్యార్థులకు గ్రామ పంచాయతీ పాలన, సర్పంచ్ విధులు మరియు 73వ రాజ్యాంగ సవరణపై అవగాహన కల్పించేందుకు మాక్ గ్రామసభను నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు, కెప్టెన్ డాక్టర్ సదానందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.