పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఎ. విజయనగరం సమీపంలో రోడ్డు ప్రమాదం, 14 ఏళ్ల విద్యార్థి మృతి
గొల్లప్రోలు మండలం ఎ. విజయనగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల పదో తరగతి విద్యార్థి కొండెంపూడి నాగ త్రినాథ్ మృతి చెందాడు. స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా గూడ్స్ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.