కరీంనగర్: నవంబర్ 29న దీక్షా దివస్ సభ: అలుగునూరులో భారీ ఏర్పాట్లు.. హాజరుకానున్న కేటీఆర్
ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో దీక్షా దివస్ సభ జరగనుంది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ గంగుల కమలాకర్ డప్పు చాటింపుతో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను సన్మానించనున్నారు.