రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు బైకు అదుపుతప్పి పడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం మదనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సిపిఎం కు చెందిన అశోక్ 22, మేఘన 18 రోజు మాదిరిగానే మదనపల్లిలోని ఓ కళాశాలకు వచ్చారు. సాయంత్రం ఇంటికి వెళుతుండగా సానిటోరియం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి పడి తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలు కుంటున్నారు