వర్ధన్నపేట: మహబూబాబాద్‌లో దారుణం: మద్యం మత్తులో వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు
మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో కర్మకాండల కార్యక్రమంలో మద్యం మత్తులో తలెత్తిన గొడవ రమేష్ అనే వ్యక్తి ప్రాణాలు తీసింది. యాకన్న, వెంకన్న, జంపయ్య, మహేష్ అనే వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో రమేష్ మరణించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తొర్రూరు పోలీసులు తెలిపారు.