డోన్: ఈనెల 14న డోన్ కు రానున్న సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
Dhone, Nandyal | Sep 13, 2026 ఎల్నినో ప్రభావం వల్ల నీరు లేక పంటలు పండక దెబ్బతిన్న రైతులను, పంటలను సందర్శించడానికి 14న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డోన్, ప్యాపిలి మండలాలకు వస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులను పరామర్శించడానికి వస్తున్నారని, కావున రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా పింఛన్ల గడువు పెంచాలని కోరారు