ఒంగోలు అర్బన్: ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆకాంక్ష : మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 16, 2026
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా కాకుటూరు వారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని మంత్రి ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. పేదల విద్య, వైద్యం ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వైసీపీ హయాంలో పేద ప్రజల ఆరోగ్యానికి గాలికొదిలి వైద్య శాఖను నిర్లక్ష్యం చేశారన్నారు.