మేడ్చల్: చిలుకానగర్ డివిజన్లో కొత్త డ్రైనేజీ, వాటర్ పైప్లైన్లు: ఎమ్మెల్యే ఆదేశం
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా, చిలుకానగర్ డివిజన్ డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. నూతన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఈ ప్రతిపాదనలను ఎమ్మెల్యేకు సమర్పించారు.