బనగానపల్లె: సంజాముల మండలంలో ఓ మసీదులో జెండా ఆవిష్కరణ
సంజామల మండలం ఆకుమల్లలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదు ఆవరణలో జాతి సమైక్యతను చాటేందుకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరులవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి ఘన నివాళులర్పించారు. దేశభక్తిని వ్యక్తం చేసే సామాజిక కార్యక్రమంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.