పూతలపట్టు: కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ఆలయ సూపరింటెండెంట్ వాసు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.