కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు మహిళలకు శక్తి యాప్, సైబర్ నేరాలు, మారిన భారతీయ చట్టాలపై అవగాహన కార్యక్రమం
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం వివిధ ప్రాంతాలలో మహిళలకు శక్తి యాప్, సైబర్ నేరాలు, మారిన భారతీయ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణ కొరకు రూపొందించిన శక్తి యాప్ ప్రతి మహిళా స్మార్ట్ ఫోన్లో ఉండాలని పోలీసులు తెలిపారు. అత్యవసర సమయంలో మహిళలు శక్తి యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారికి రక్షణ కల్పిస్తారని తెలిపారు. ఇక సైబర్ నేరాలపై అవగాహన కల్పించి మారిన భారతీయ చట్టాలు కఠిన శిక్షలపై అవగాహన కల్పించారు.