మెట్పల్లి: మెట్ పల్లి వద్ద ఘోర ప్రమాదం: ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలు, 6 గురి పరిస్థితి విషమం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆరపేట వద్ద ఆటో బోల్తా పడటంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచాపూర్ నుండి రేగుంట వెళ్తుండగా రోడ్డుపై బర్రె అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన 6 గురిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు.