నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, అప్పారావుపాలెం వద్ద పెన్నా నదిలో 6 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. పశువులు కాసేందుకు పెన్నా నదిలోకి 6 మంది వెళ్ళగా ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చేసిందని గ్రామస్తులు తెలియజేశారు. వారిని రక్షించేందుకు ఇప్పటికే పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామతులు భారీగా చేరుకున్నారు. తమ వాళ్లకు ఏమవుతుందో అని బంధువులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.