కొండపి: కొండేపి లో కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ను నిర్వహించి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసిన సిడిపిఓ
ప్రకాశం జిల్లా కొండేపి లో కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ను శుక్రవారం సిడిపిఓ మాధవి లత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా కిషోర్ బాలికలకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను నష్టాలను బాల్య వివాహాలు చేయటం నేరమని అలా ఎవరైనా చేసినట్లయితే వారు శిక్షార్హులని కూడా బాల్యవివాహాలను చేసినప్పుడు గర్భస్రావం శిశు మరణాలు మాతృ మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 18 సంవత్సరాలు వయసు నిండిన వారికి మాత్రమే వివాహానికి అర్హులని మండలంలోని 19 పంచాయతీల కన్వీనర్లు మహిళా సంరక్షణ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎం లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.