కొండపి: ఎస్పీ ఆదేశాలతో వాహన తనిఖీలు నిర్వహించిన కొండేపి పోలీసులు
ప్రకాశం జిల్లా కొండేపిలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఎస్ఐ ప్రేమ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. అదేవిధంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు అపరాధ రుసుములను విధించడమే కాకుండా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తూ భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందని దీనిపై ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పార