సూర్యాపేట: సూర్యాపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో: జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ సూర్యాపేటలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అంజనాపురి కాలనీ సమీపంలో చేపట్టిన ఈ నిరసనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్ష గొంతు నొక్కుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.