డోన్: డోన్ ఎక్సైజ్ ఎస్సై కి రాష్ట్రస్థాయి అవార్డు
Dhone, Nandyal | Aug 15, 2026 డోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై సోమశేఖర్కు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. శనివారం విజయవాడలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ IPS, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ C. శ్రీధర్ IAS చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ, నిబద్ధతతో పాటు ఎక్సైజ్ చట్టాల అమలు, అక్రమ మద్యం నియంత్రణలో చూపిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు.