పార్వతీపురం: 3వ జాతీయ లోక్ అదాలత్లో 368 కేసులు పరిష్కారం
పార్వతీపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 3వ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 368 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో సివిల్, క్రిమినల్ మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.