సూర్యాపేట: సూర్యాపేటలో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా: శక్తి కోర్సును రద్దు చేయాలని డిమాండ్
సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన 'శక్తి' కోర్సును మరియు GO నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దీనివల్ల డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.