గుంతకల్లు: పామిడి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అద్భుతం, స్వామి పాదాలను తాకిన సూర్య కిరణాలు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆలయంలో స్వామి పాదాల చెంతకు సూర్య కిరణాలు చేరాయి. ఆలయ అర్చకుడు పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పామిడి పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామి పాదాలకు సూర్య కిరణాలు తాకాయి. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత స్వామి పాదాలకు సూర్యకిరణాలు తాకుతాయని అన్నారు. అంత ఆ భగవంతుడి మహిమ అని అర్చకుడు తెలిపారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి పాదాల చెంతకు సూర్యకిరణాలు తాకుతున్న వీడియోలను తీశారు.