అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్ ఆదేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా, సీసీటీవీ పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.