మహబూబాబాద్: మహబూబాబాద్‌లో విద్యార్థినులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన
మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల భద్రత, సైబర్ నేరాలు, POCSO చట్టం మరియు భరోసా కేంద్రం సేవలపై 600 మంది విద్యార్థినులకు పోలీసులు వివరించారు. అత్యవసర సాయం కోసం 112, 1930 వంటి నెంబర్లను సంప్రదించాలని సూచించారు.