శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ నామినేషన్లను బహిష్కరించిన కుశలపురం గ్రామస్థులు
శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనమైన కుశలపురం గ్రామస్థులు నామినేషన్లను బహిష్కరిస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో నామినేషన్లు వేయకూడదని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ 17న ఉండటంతో, తీర్పు తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు.