ఒంగోలు అర్బన్: జగన్ బయటకు వస్తె జనం చనిపోవటం లేదా గాయపడటం జరుగుతుంది : ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు
Ongole Urban, Prakasam | Aug 13, 2026
ప్రకాశం జిల్లా లో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు మాజీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు.జగన్ కి భద్రత కల్పించాలని వైసీపీ ఎంపీలు కేంద్ర హోం మినిస్టర్ ని కలిశారు అని,జగన్ భద్రత విషయంలో హోం మినిస్టర్ వైపు నుండి కూడా ఘాటు సమాధానం వచ్చింది అన్నారు.జగన్ భద్రత కంటే జగన్ నుండి ప్రజలకు భద్రత కల్పించాలని వైసీపీ ఎంపీలకు చెప్పారు. 20, 30 కిలోమీటర్ల దూరానికి కూడా ఆరేడు గంటలు జగన్ ప్రయాణిస్తున్నాడు అని అన్నారు.జగన్ లా అండ్ ఆర్డర్ ని ఇబ్బంది పెడుతున్నారు అని జగన్ పర్యటనలపై పూర్తి సమాచారం కేంద్ర హోం శాఖ దగ్గర ఉంది అని అన్నారు. జగన్ బయటికెళ్తే జనం చనిపోవడమో... గాయపడటమో జరుగుతుంది అన్నారు