నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో జిల్లా ఎస్పి ఆజిత వెజండ్ల విచారణ చేపట్టారు. ఇటీవల విద్యాలయంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని ప్రణీత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను వివరాలు ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎవరు భయపడవద్దు అంటూ విద్యార్థులకు ఎస్పీ ధైర్యం చెప్పారు. చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు.