విజయవాడ అర్బన్: వినాయక చవితి: మోపిదేవిలో విగ్రహాల విక్రయాలు జోరు.. 12 అడుగుల వరకు అందుబాటులో
వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో గణేష్ విగ్రహాల విక్రయాలు ఊపందుకున్నాయి. అడుగు నుంచి 12 అడుగుల వరకు అందుబాటులో ఉన్న విగ్రహాల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.