మాడుగుల: దేవరాపల్లి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు: తప్పిన పెను ప్రమాదం
దేవరాపల్లి మండలం ముసిడిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో ఒక యువకుడికి కాలు విరిగింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది.