కాకినాడ సిటీ: కాకినాడ మేయర్ రిజర్వేషన్ జీవోపై వివాదం: సుప్రీంకోర్టుకు వెళ్తామన్న రమణరాజు
కాకినాడ మేయర్ రిజర్వేషన్ల కోసం జారీ చేసిన జీవో 252 రాజ్యాంగ విరుద్ధమని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. రొటేషన్ నిబంధనల ఉల్లంఘనపై న్యాయ నిపుణులతో సంప్రదించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.