వనపర్తి: వనపర్తి తిరుమలయ్యగుట్టలో పటిష్ట బందోబస్తు: వృద్ధురాలిని ఆదుకున్న పోలీస్
శ్రావణమాసం చివరి శనివారం కావడంతో తిరుమలయ్యగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా ఎస్సై హృషికేష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సమయంలో వృద్ధురాలిని సురక్షితంగా కిందకు దింపిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.