వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి: రైతులకు కీలక సూచనలు
పెద్దమందడి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని రైతులకు సూచించారు. పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.