విజయవాడ అర్బన్: కృష్ణాజిల్లాలో వర్షాల హోరు: వినాయక చవితి షాపింగ్‌కు తప్పని ఇబ్బందులు
అల్పపీడన ప్రభావంతో కృష్ణాజిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వినాయక చవితి పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు తీవ్ర అవస్థలు పడ్డారు.