కరీంనగర్: కరీంనగర్లో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష: 14 వేల మంది అభ్యర్థులకు పటిష్ట భద్రత
ఈనెల 29న జరగనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులతో సమావేశమయ్యారు. 20 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు, బయోమెట్రిక్ తనిఖీలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 14 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.