నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన 34,223 మందికి రైతులకు రూ. 22.95 కోట్లు నిధులు విడుదల అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం క్రింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందన్నారు. స్వర్ణాంధ్ర సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సోమశిల హైలెవెల్ కెనాల్ పూర్తయితే 90 వేల మంద