పూతలపట్టు: వినాయక చవితి: మండపాల నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలు
వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు ప్రకటించారు. నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, కొన్ని సమయాల్లోనే భక్తి పాటలు ప్లే చేయాలని సూచించారు. మద్యం సేవించిన వారు నిమజ్జనంలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.