గాజువాక: గాజువాకలో నిజాయితీకి నిదర్శనం: దొరికిన 1.55 లక్షల నగదును పోలీసులకు అప్పగించిన వ్యక్తి
విశాఖపట్నం గాజువాకలో తనకు దొరికిన రూ.1,55,900 నగదును, విలువైన పత్రాలను గోరు వీరభద్రరావు అనే వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా పోలీసులకు అప్పగించారు. ఆ నగదును పోలీసులు అసలైన యజమాని సాయికిషోర్కు అందజేశారు. వీరభద్రరావు నిజాయితీని పోలీసులు అభినందించారు.