కొండపి: నిరుద్యోగ యువతకు ఫ్రీ కంప్యూటర్ టాలీ ఉచిత శిక్షణ, ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి
ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు 38రోజులు 'కంప్యూటర్ టాలీ'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 38 రోజులు ఒంగోలులోని రూడ్సెట్లో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్సెట్కు రావాలన్నారు.