డోన్: డోన్ లో ప్రారంభమైన వినాయక చవితి సందడి
Dhone, Nandyal | Sep 13, 2026 డోన్‌లో వినాయక చవితి సందడి మొదలైంది. చాలా చోట్ల ఇప్పటికే మండపాలను సిద్ధం చేశారు. మంచి రోజు చూసి వినాయక విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలో 'గణేశ్ ఆగమనం' పేరిట యువత సరికొత్తగా డీజే పాటలు, ఫైర్ క్రాకర్స్ వెలిగించి దేవుడిని ఆహ్వానిస్తున్నారు. డోన్‌లో కొందరు మహిళ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ విగ్రహాలను ఊరేగింపుగా వేదికల వద్దకు తీసుకెళ్లారు.