మహబూబ్ నగర్ అర్బన్: హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ.. పాలమూరులో అమ్మకాలు
హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్ యజమాని జయప్రకాశ్ గౌడ్, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలనే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చాడు. గత 9 ఏళ్లుగా పగలు పాఠశాల నడుపుతూ, రాత్రిపూట అల్ట్రాజోలం అనే డ్రగ్స్ ను తయారు చేస్తున్నాడు. శనివారం డ్రగ్స్ విక్రయిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, భూత్పూర్ ప్రాంతాలకు ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఈ వార్త ఆదివారం పాలమూరు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.