మహబూబ్ నగర్ అర్బన్: జిల్లా కేంద్రంలోని IB చౌరస్తా వద్ద అదుపుతప్పి విగ్రహాన్ని ఢీకొన్న ట్రాక్టర్, తప్పిన పెను ప్రమాదం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఐ.బి చౌరస్తా వద్ద ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. నేటి తెల్లవారుజామున రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న విగ్రహాన్ని ఢీకొట్టింది. విగ్రహం పూర్తిగా ధ్వంసం కాగా ఎటువంటి ప్రాణనాష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.