రాయదుర్గం: మోసం చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు : రూరల్ సిఐ వెంకటరమణ
లక్ష కు రోజుకు రెండు వేలు ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేయడంతోపాటు నేమకల్లు కు చెందిన వ్యక్తి నుండి 1.50 లక్షలు దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాదితుల పిర్యాదుతో నిందితులు మనోహర్ రెడ్డి,రామకృష్ణారెడ్డి లను ఎర్రగుంట సమీపంలో అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలలను ఆదివారం సిఐ వెల్లడించారు.