అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఆరోపణలు: కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత నగేష్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర నాయకులు నగేష్ ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని, కావాలంటే దర్యాప్తు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. పాయల్ శంకర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన వివరించారు.