జనగాం: తాడూరి నాయక్ విగ్రహ ఏర్పాటుపై కలెక్టర్ కీలక ఆదేశాలు
జనగాం బైపాస్ నందన గార్డెన్స్ వద్ద తాడూరి నాయక్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్థలం, ట్రాఫిక్ అంశాలపై నివేదిక కోరారు. తుది నిర్ణయం వచ్చేవరకు పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు.