ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు, మద్యం తాగిన వారిపై కేసు నమోదు
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం పోలీసు అధికారులు వాహనదారులకు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై అధికారులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు మద్యం తాగకుండా వాహనాలను నడపాలని తెలిపారు.