కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో జరిగే బీచ్ ఫెస్టివల్ పై వివరాలు వెల్లడించిన ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకలలో జరిగే బీచ్ ఫెస్టివల్కు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు అహర్నిశలు కష్టపడుతిన్నారని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రకటించారు. ఫెస్టివల్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకు ఉంటాయన్నారు. మొదటిసారిగా జిల్లాలో కనివినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.