కోరుట్ల: మున్సిపల్ కార్మికులను ఇంటి పనులకు వాడుకుంటున్న ఎమ్మెల్యే సంజయ్ పై జువ్వాడి కృష్ణారావు ఫైర్
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన ఇంటి పనులకు మున్సిపల్ కార్మికులను వినియోగించుకోవడంపై టీపీసీసీ సభ్యుడు జువ్వాడి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. కార్మికులకు చెల్లించిన జీతభత్యాలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించి క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.