ఖిలా వరంగల్: వరంగల్ మామునూరులో రోడ్డు ప్రమాదం: హోంగార్డుకు తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం మామునూరు 4వ బెటాలియన్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హోంగార్డు సుధాకర్‌ను కారు ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.