తుని: తాండవ, పంపా నదులకు గోదావరి జలాలు: సీఎంను కోరిన ఎమ్మెల్యే యనమల దివ్య
Tuni, Kakinada | Sep 11, 2026 తునిలో తాగునీటి సమస్యను నివారించేందుకు పోలవరం కాలువ ద్వారా తాండవ, పంపా నదులకు గోదావరి నీటిని అందించాలని సీఎం చంద్రబాబును కోరినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా గ్రామాల్లోని చెరువులను నింపాలని విన్నవించగా, సీఎం సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు.